బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు : ఎర్రబెల్లి
తెలంగాణలో బీజేపీ ని ఎవరు గుర్తించడం లేదని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పనుల గురించి ఎర్రబెల్లి వివరించారు. 12 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేస్తున్నామని, ఐకెపి సెంటర్ల ద్వారా మాస్క్ లు ఇస్తున్నామని, .సామాజిక దూరం పాటించి పనులు చేస్తున్నామని తెలిపారు. పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చెరువులను అభివృద్ధి చేసుకోవడం తో ఉపాధి హామీ కార్మికులకు పని దొరకడం లేదు అందుకని వ్యవసాయం కు అనుసంధానం చేయాలని కోరాం దీనితో రైతులు సగం ప్రభుత్వం సగం చెల్లిస్తుంది. ఉపాది హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని పీఎం ను అడిగాము. దీని వల్ల రైతులకు, కూలీలకు మేలు జరుగుతుంది. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నాము.గన్ని బ్యాగ్ ల కొరత ఉంది అయిన అధిగమించాం. తెలంగాణ రాష్ట్రంలో గోదాముల నిర్మాణం సీఎం కేసీఆర్ చేపట్టారు దానితో చాలా ఇబ్బందులు తప్పాయి. మూడు సంవత్సరాలుగా ఉపాధి హామీ పనులను రైతులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగారు.కానీ ఇప్పటి వరకు చేయలేదు దానిపై చేయాలని ధర్నా కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. రైతులకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు మోడీకి కానీ చేయలేదు అది చాలా మంచి పథకం. కేంద్రం నిధులు చాలా పెండింగ్ లో ఉన్నాయ్.అవ్వి ఇప్పించు దమ్ముంటే అని బండి సంజయ్ కి సవాలు చేశారు. కేంద్రం రాష్టాలను ఇబ్బంది పెడుతున్నారు. అయిన ఇది సమయం కాదు కాబట్టి ఉరుకుంటున్నాం. బీజేపీ రాష్ట్రంలో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొంటున్నారా ,రాష్ట్ర బీజేపీ నాయకులు చూపించాలి ప్రశ్నించారు. రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు ఏదో చేస్తే దానిపై రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తే అడ్రస్ లేకుండా పోతారాని హెచ్చరించారు. కేసీఆర్ అన్ని త్యాగాలు చేసి రైతులను ఆదుకుంటున్నారు. కేసీఆర్ వంద శాతం సక్సెస్ అయ్యారు. బీజేపీని చేస్తున్న పనులను ఎవరూ హర్షిస్తలేరు. కేంద్రం నుంచి రాష్టాలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి.రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఆయన పోయి ఢిల్లీ లో ధర్నా చేయాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ పని చేస్తున్నారు. అందరూ ప్రభుత్వానికి సహకరించాలి కోరారు.