శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు : ఈటెల
కరోనా బాధితులపై శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంది పడ్డారు. తెలంగాణాలో గాంధీ ఆసుపత్రి కోవిడ్ రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి అని తెలిపారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ రోగులకు నిత్యం పౌష్టిక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 984 కేసులు నమోదు అయినాయని కాగా అందులో 663 పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. 291 కోలుకున్నారని చెప్పారు. ఇవాళ కొత్తగా 13 కేసులు నమోదు అయ్యానని వివరించారు. విపక్షాలు కూడా సహకరించాలని కోరారు.