‘ప్యాకేజీ’ జోష్ తో…. లాభాల్లో మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించవచ్చన్న అంచనాల నేపథ్యంలో సూచీలు లాభాల బాట పట్టాయి. ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ షేర్ల అండతో లాభాలు నమోదు చేశాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం వంటి పరిణామాలు తోడయ్యాయి. దీంతో సెన్సెక్స్ 483.53 పాయింట్లు లాభపడి 31,863.08 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 126.60 పాయింట్లు లాభపడి 9,313.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.07గా ఉంది. నిఫ్టీలో కోటక్ మహీంద్రా, టీసీఎస్ , ఇన్ఫోసిస్ , ఐసీఐసీఐ బ్యాంక్ , జీ ఎంటర్ టైన్ మెంట్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, హెచ్ యూఎల్ , శ్రీ సిమెంట్స్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ , ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.