ఎంజీ మోటార్ ఇండియా, ఫ్రంట్ లైన్ వారియర్స్ సురక్షిత ప్రయాణం కోసం 100 హెక్టార్ లను అందించనుంది
ఎంజీ మోటార్ ఇండియా, కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా తన సహాయాన్ని మరింతగా విస్తరిస్తోంది, ఇందులో భాగంగా, సమాజ సేవ కోసం వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులకు 100 ఎంజి హెక్టార్లను మే 2020 చివరి వరకు అందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి యు.కె. అంతటా ఎన్.హెచ్.ఎస్ ఏజెన్సీలకు 100 ఎంజి జెడ్ ఎస్ ఇవి లను అందించడానికి ఎంజి మోటార్ యు.కె. కట్టుబడి ఉంది.
భారతదేశంలో, కోవిడ్-19 ను ఎదుర్కొనాలనే దేశవ్యాప్త కృషికి తోడ్పాటుగా, ఈ కార్ల తయారీదారు సంస్థ, తన వంతుగా 100 హెక్టార్లను ఉచితంగా అందిస్తోంది. అన్ని కార్లు కూడా తగినంత ఇంధనం మరియు డ్రైవర్లతో సహా అందించబడతాయి మరియు ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తున్న, వైద్య సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులు సురక్షితంగా ప్రయాణించడానికి ఇవి ఉపయోగించబడతాయి, ఎందుకంటే భారత ప్రభుత్వం కోవిడ్-19 పై తమ యుద్ధాన్ని ముమ్మరం చేస్తోంది. ఈ కార్లు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాక్ డౌన్ సమయంలో ఎంజి వారి దేశవ్యాప్త డీలర్ల నెట్‌వర్క్ ద్వారా సరఫరా చేయబడతాయి.
ఈ 100 హెక్టార్లను జాతీయ సేవ కోసం వినియోగించడానికి, ఈ కార్ల తయారీదారు ఇటీవల ప్రవేశపెట్టిన ‘ఎంజి క్రిమిరహితం మరియు పంపిణీ’ విధానాన్ని అనుసరిస్తారు.
ప్రస్తుతం ఈ మహమ్మారి ఎక్కువవుతున్న పరిస్థితులలొ ఎంజి మోటార్స్, పలు సంఘాలకు సహాయం చేస్తోంది. కరోనావైరస్ ముప్పును ఎదుర్కోవడానికి ఈ కార్ల తయారీదారు, వెంటిలేటర్లను, ఆరోగ్య మరియు పరిశుభ్రతా వస్తు సామగ్రి, పిపిఇ కిట్లు, సర్జికల్ మాస్క్‌లు, గ్లోవ్స్, శానిటైజర్స్, శానిటైజర్ స్ప్రేయర్స్, ఫుడ్ అండ్ రేషన్ కిట్‌లను విరాళంగా ఇచ్చి పంపిణీ చేశారు.