ఇళ్ల అద్దె వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కోవిడ్ 19 విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, 2020 నెల నుంచి మూడు నెలలపాటు ఇళ్ల అద్దె వసూలు చేయరాదని యజమానులకు ప్రభుత్వ ఆదేశించింది.
మూడు నెలల తరువాత ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం. ఈ మూడు నెలల అద్దె బకాయిలకు యజమానులు ఎలాంటి వడ్డీని వసూలు చేయకూడదని తెలిపింది.