ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కర్నూలులో 234 మంది, గుంటూరులో 195 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 27 మంది చనిపోగా, ఇందులో గుంటూరు జిల్లాకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు.