కరోనా కట్టడిలో తెలంగాణలో బెటర్ : మంత్రి ఈటెల

దేశంలోని పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ఎంతో మెరుగుగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. ఇప్పటి వరకు 970 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 25 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ఇవాళ కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వివరించారు కాగా అందులో హైదరాబాద్ GHMC 13 పరిదిలో వచ్చాయన్నారు. గాంధీ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నాము అని చెప్పారు. త్వరలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ లో సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.