రైతుకి కష్టం రానివ్వం : పల్లా
తెలంగాణ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రైతుకు కూడా కష్టం రానివ్వం అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టకాలం లో దేశం లో ఏ రాష్ట్రము కూడా చేయని పనిని తాము చేస్తున్నాము అని అన్నారు. 5200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయని, మరో వెయ్యి సబ్ సెంటర్లు కూడా ప్రారంభం అయ్యాయని వివరించారు. రాష్ట్రంలోని మక్కలు,జొన్నలు,కందులు,కూడా కొంటామన్నారు. 11లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 20 వేల లారీలు ప్రతీ రోజు ధాన్యం కొనుగోలుకు వాడుతున్నామన్నారు. ఒకవైపు కరోనాతో పోరాడుతూనే రైతులకు మేలు చేస్తున్నామని, మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రతీ రోజు లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులు కొంటున్నామని చెప్పారు. కంట్రోల్ రూం కు వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని , కేంద్ర, ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే తాలు నిర్ధారిస్తున్నామని తెలిపారు. మిల్లర్ల కు కూడా రైతులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్తామన్నారు. అయితే రాజకీయ పార్టీల పద్ధతి సరికాదన్నారు. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వమూ ధాన్యం కొనుగోలు చేయడం లేదు..
బ్యాంకు గారంటీను కూడా కాంగ్రెస్ తప్పు పట్టడం శోచనీయం..ఇప్పటికే రైతులకు చెల్లింపు లు మొదలయ్యాయని తెలిపారు. ఇవ్వాళ్టికి 332 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కొద్దిగా ఓర్చుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు దీక్ష దేనికి అని ప్రశ్నిచారు. కేంద్రం సేకరిస్తుంటే అడ్డుపడ్డామా… దమ్మూ ధైర్యం ఉంటే వ్యవసాయానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం చేయండి. దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయండి…కష్ట కాలంలో ఉన్న సమయంలో ఇబ్బందులు అధిగమిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తుంటే అడ్డుకోవడం సరికాదు..చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు. రైతు అనే వాడు దానం చేస్తాడు,కానీ దహనం చేయడు..ఏ రైతు ధాన్యం తగల పెట్టడు.అది రాజకీయ వానర మూక పనే అన్నారు.