సినిమా కథ కంచికేనా
మనసు భాగాలేకపోయిన… సంతోషంగా ఉన్నా…ఊరి నుండి దోస్తులు వచ్చిన… ఇలా ఎన్నో ఏ సందర్భం అయినా ఆలా సినిమాకి వెళ్దాం పదా అనేవారు. మనతో నవ్వులు నవ్వించిన, మనతో కన్నీరు పెట్టించిన సినిమా…ఆ సినిమానే ఇప్పుడు కన్నీరు పెడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఫిలింనగర్ లో .
కరోనా లాక్ డౌన్ తరువాత సినిమా రంగం పరిస్థితి ఏంటి అనే అంశంపై ప్రత్యేక కథనం డెక్కన్ న్యూస్ పాఠకుల కోసం.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంత ఇంత కాదు. ఎవరిని కదిలించిన కన్నీటి కష్టాలే… జానెడు కడుపు నింపుకోవడానికి పడుతున్న కష్టాలు ఎన్నో. ప్రధానంగా మాములు రోజుల్లో సినిమా రంగంలో ఉన్న వారికి ఉపాధి దొరకడం అంతంత మాత్రమే. ఈ కరోనా వాళ్ళ ఆ ఉపాధి కూడా అంతరించిపోయంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గడువు ముగిసిన తరువాత సినిమా రంగం ఎలా ఉండబోతోంది అంటే చీమని చీకట్లే సినిమా రంగ నిపుణులు, సామాన్య ప్రజలు చెబుతున్నారు.
లాక్ డౌన్ తరువాత ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చి రోగాలు కొని తెచ్చుకోరు అని అంటున్నారు సామాన్య ప్రజలు. మామూలు థియేటర్ల నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఇక సినిమా చూడడం కలే అని కొన్ని సర్వే రెపొర్ట్ల్స్ చెబుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత అబ్దమెంత అనేది తేలాలి. ఎక్కడ చుసిన ప్రజలు మాత్రం మాల్స్ , షాపింగ్ వాటికీ వెళ్లడం మానేస్తామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో మనిషికి కావాల్సింది మంచి ఆరోగ్యం తప్ప వినోదం కాదు అంటున్నారు. కావాలి అంటే టీవీలోనే అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ , ఇటీవల కొత్తగా వచ్చిన ఆహా వంటి వాటిల్లో సినిమాలు చూస్తామంటున్నారు. ఇక ఇటీవల వెబ్ సిరీస్లు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి కాబట్టి సినిమా మీద మోజు తగ్గుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా భయంతో ఇప్పటికే సిమిమా షూటింగ్స్ అన్ని ప్యాకప్ చెప్పేసాయి. అయితే లాక్ డౌన్ తరువాత కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని సినిమా రంగం గుస గుసలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమా మీద పెద్ద ఆశలు పెట్టుకున్న థియేటలు , మాల్స్ యాజమాన్యం కూడా భయం గుప్పటిలో ఉన్నారని సమాచారం. అయితే లాక్ డౌన్ తరువాత ఎన్ని రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయి అనేది ఇంకా ఎవరికీ తెలియడం లేదు.
ఒకవేళ సినిమాలు తీయాలి అని పట్టు పట్టుకొని కూర్చొంటే కష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమా రంగంలో ఎక్కువగా ముంబై ముద్దుగుమ్మలే హీరోయిన్స్ గా ఉన్నారు. అలాగే పొరుగు రాష్ట్రాలు అయినా తమిళనాడు, కర్ణాటక నుండి కూడా ఎక్కువగా ఉన్నారు అని చెప్పొకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రస్తుత కరోనా కేసులు చూస్తే తెలంగాణ కంటే ఎక్కువగా మహారాష్ట్ర , తమిళనాడు లోనే ఉన్నాయి. అయితే లాక్ డౌన్ తరువాత మళ్ళీ పొరుగు రాష్ట్రాలలో లేదా వారిని అక్కడికి నుండి ఇక్కడికి
తీసుకొచ్చిన కరొనను వెంట తేకున్నటు అవుతుంది. ఏది ఏమైనా కరోనా వల్ల సినిమా రంగానికి గడ్డు కాలమే అని చెప్పు కోవచ్చు
- శ్రీ