ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా ముగిసింది. తెలంగాణ లోని పల్లెలను కాపాడుకోవలిసిన అక్కెర ఉంది పేర్కొన్నారు. ఈ కరోన మహమ్మరి పోతేనే ఆర్థికంగా మంచిరోజులు వస్తాయన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. లాక్ డౌన్ విషయం కఠినంగా ఉండలని సూచించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలి ఆదేశించారు.
అలాగే సీఎస్ నేతృత్వంలో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. కరొనను కట్టడి చేసే దిశగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పని చేయాలన్నారు.