రైతుల సంగతి సరే మా సంగతి ఏందీ ?

కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న పరిస్థితి లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయడం హర్షించదగ్గ విషయం ఇలాంటి పరిస్థితుల్లో AEO లకు కనీస వసతులు కల్పించడం లేదని వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల నుండి కనీస రవాణా సౌకర్యం లేకున్నా అధికారులు రైతుల వద్దకు వెళ్లి కూపన్లను ఇస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దిలేకుండా చూస్తున్నాం అని అన్నారు. కానీ తమకు కనీస మాస్క్ లు గాని శ్యానిటైజర్లు గాని కల్పించలేదన్నారు. అలాగే విధులు నిర్వహిస్తున్న మహిళ aeo లకు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు అయిన రైతులకు ఇబ్బందులు కలగొద్దని బరిస్తున్నాం సేవలు అందిస్తున్నాం పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విధులకు హాజరు అవుతున్న AEO లను ఆపి డ్యూటీకి వెళుతున్నాం అని పాస్ చూపించిన కూడా దాన్ని చింపి వేసి పోలీసులు చితకబాదారు అని ఆవేదన వ్యక్తం చేసారు. మహిళ AEO లను సైతం స్కూటీ కీస్ తీసుకొని వెటకారంగా మాట్లాడుతూ పోలీసులు సతాయించడం దారుణం అన్నారు. మండుటెండలో కూడా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ విధులు నిర్వహిస్తున్న aeo లపట్ల పోలీసుల వైఖరిని నిరశిస్తున్నాం అయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల శ్రద్ద వహించి కనీస ఏర్పాట్లు, పోలీసుల నుండి ఇబ్బందులు తప్పేలా చూడాలని సీఎం కెసిఆర్ అని కోరారు.