మూడు జిల్లాలే టార్గెట్

తెలంగాణాలోని మూడు జిల్లాలో అదుపు లేకుండా విజృంభిస్తున్న కరోనాని ఎలా కట్టడి చేయాలో అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీ సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మూడు జిల్లాల పర్యటన అనంతరం ఆయా జిల్లాల పరిస్థితి పై సీఎం కేసీఆర్ కు వివరిస్తున్న సీఎస్. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికాలతో చర్చిస్తున్న సీఎం కేసీఆర్.