మా రాష్ట్రంలో కరోనా లేదు
కరోనా తో ప్రపంచం అంతా కకావికలం అవుతుంటే…. భారత దేశంలోని ఒక రాష్ట్రము మాత్రం నమ్మలేని నిజాన్ని చెప్పింది. మా రాష్ట్రంలో కరోనా కేసులు లేవు అని వెల్లడించింది. ఎలా కరోనా కేసులు లేవు అని చెప్పిన మణిపూర్ దేశంలో రెండవ రాష్ట్రం. నిన్న గోవా రాష్ట్రం కూడా తమ వద్ద ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు లేవు అని పేర్కొంది. గోవా తర్వాత తమ రాష్ట్రంలో ఒక్క కోవిడ్-19 కేసు లేదని గోవా ప్రకటించిన మరుసటి రోజే మణిపూర్ కూడా ఇదే ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కోవిడ్ సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు.
మణిపూర్ ఇప్పుడు కరోనా లేని రాష్ట్రమని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కోవిడ్ బాధితులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్‌డౌన్ కారణంగానే ఇది సాధ్యమయింద’ని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇంఫాల్‌లో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వస్తువుల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు.