3 కోట్ల మందికి భోజనాలు అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ అన్న సేవ
కార్పొరెట్ ఫౌండేషన్ చే అంతర్జాతీయంగా ఓ అతిపెద్ద కార్యక్రమం
16 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతంలో 2 కోట్ల భోజనాలు ఇప్పటికే పంపిణి
#CoronaHaaregaIndiaJeetega
రిలయన్స్ ఫౌండేషన్ తన భోజన పంపిణి కార్యక్రమం మిషన్ అన్నసేవను విస్తరించింది. భారతదేశవ్యాప్తం గా నిరుపేదలకు 3 కోట్ల భోజనాలను అందించనుంది.
అంతర్జాతీయంగా మరెక్కడ కూడా ఏ కార్పొరెట్ ఫౌండేషన్ నిర్వహించని విధంగా, అత్యంత భారీ స్థాయిలో మిషన్ అన్నసేవ పేరిట అతిపెద్ద భోజన పంపిణి కార్యక్రమాన్ని చేపట్టింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యొక్క దాతృత్వ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటికే 16 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 68 జిల్లాల్లో 2 కోట్ల భోజనాలను పంపిణి చేసింది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘’ప్రపంచానికి, భారతదేశానికి, మానవాళికి కోవిడ్ -19 ఒక ఊహించని ఉత్పాతంగా మారింది. భారతదేశం లో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో, తమ మరుసటి భోజనం కోసం రోజువారీ వేతనాల పై ఆధారపడిన భారతీయుల కోసం మన గుండెలు కొట్టుకుంటున్నాయి. వారు కూడా మన కుటుంబంలో – మన సొంత భా రత్ పరివార్ లో- సభ్యులే. అందుకే ఆకలితో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ లో మేము మిషన్ అన్నసేవను ప్రారంభించాం. మన సంస్కృతిలో అన్నదానం మహాదానం. అన్నం పర బ్రహ్మ స్వరూపం అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. మిషన్ అన్న సేవ ద్వారా మేము దేశవ్యాప్తంగా నిరుపేదలకు మరియు కరోనా పై పోరులో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వారికి 3 కోట్లకు పైగా భోజనాలు అందిస్తున్నాం. అంతర్జాతీయంగా మరెక్కడ కూడా ఏ కార్పొరెట్ ఫౌండేషన్ నిర్వహించని విధంగా చేపట్టిన అత్యంత భారీ స్థాయి భోజన పంపిణి కార్యక్రమం ఇది’’ అని అన్నారు.
ఈ కార్యక్రమం కింద రిలయన్స్ ఫౌండేషన్ వండిన ఆహారం, రెడీ-టు-ఈట్ ఆహార ప్యాకెట్లు మరియు డ్రై రేషన్ కిట్స్ ను కుటుంబాలకు అందిస్తోంది. కమ్యూనిటీ కిచెన్లకు బల్క్ రేషన్ ను అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందుతున్న వారిలో రోజువారీ కూలీలు, మురికివాడవాసులు, పట్టణ సేవలు అందించే వారు, ఫ్యాక్టరీ కార్మికులు, వృద్ధాశ్రమ వాసులు, అనాధాశ్రయాలకు చెందిన వారు ఉన్నారు. జూనియర్ మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కూడా వీరిలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఆహార టోకెన్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, సహకారి భండార్ వంటి రిలయన్స్ అవుట్ లెట్స్ లో ఈ టోకెన్లను ఇవ్వడం ద్వారా కావాల్సిన సరుకులు పొందవచ్చు.
లాక్ డౌన్ సమయంలో భారతీయులెవరూ ఆకలితో అలమటించకుండా చూసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది మరియు రిలయన్స్ కుటుంబం అంతా అంతా కూడా యుద్ధ ప్రాతికన ఈ కార్యాచరణపై పని చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అవసరమైన సరుకులను ప్యాక్ చేయడం, ప్రిపేర్ చేయడం, సరఫరా చేయడం ద్వారా
రిలయన్స్ రిటైల్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ముంబై, సిల్వాస, వడోదర, పాతాళ గంగ, హజిరా, జాజ్ జార్, షాదోల్, జామ్ నగర్, దహేజ్, బారాబంకి, నాగోథానె, గడిమొగ, హోషియార్ పూర్ వంటి రిలయన్స్ సైట్స్ వద్ద ఎంప్లాయి వలంటీర్లు తమ తమ ప్రాంతాల్లో పేదలకు ఉచిత భోజనాలను అంది స్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిషాలలోని నిర్దిష్ట రిలయన్స్ పెట్రోల్ స్టేషన్ల వద్ద అక్కడి సిబ్బంది, నిత్యావసరాలు సరఫరా చేసే ట్రక్కు డ్రైవర్లకు ఉచిత భోజనాలను పంపిణి చేస్తున్నారు.
తమ తమ ప్రాంతాల్లో ఇదే తరహాలో ఆకలి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టిన 70 మంది భాగస్వాములుకు రిలీఫ్ కిట్స్ మరియు బల్క్ రేషన్ ను రిలయన్స్ ఫౌండేషన్ సరఫరా చేస్తోంది.
భోజన పంపిణి కార్యక్రమానికి అదనంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరియు రిలయన్స్ ఫౌండేషన్ లు కోవిడ్ -19పై యుద్ధంలో దేశం గెలుపొందేలా తమ 24×7, బహుముఖ, ఆన్ గ్రౌండ్ ప్రయత్నా లను కొనసాగిస్తున్నాయి. వివిధ సహాయ కార్యక్రమాలకు గాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇప్పటికే రూ.535 కోట్లు విరాళంగా అందించింది. ఇందులో పీఎం – కేర్స్ ఫండ్ కు అందించిన రూ.500 కోట్ల విరాళం కూడా ఉంది.