ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీల విక్రయాలకు బ్రేక్‌

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసరాలు కాని వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టంచేసింది. ఈ-కామర్స్‌ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందుస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.