టెన్షన్లో సంజయ్ దత్
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణం ఆయన శ్రీమతి మాన్యతా దత్, ఇద్దరు పిల్లలు దుబాయ్లో చిక్కుకున్నారు. కరోనా వైరస్ క్రమంగా పెరుగుతున్న సమయంలో ఇండియా లాక్డౌన్ను ప్రకటించింది. అప్పటికే సంజయ్ దత్ కుటుంబం దుబాయ్లో ఉంది. ఇక్కడకు రాలేని పరిస్థితుల్లో వారు అక్కడే ఉంటున్నారు. తానిప్పుడు ఒంటరిగా ముంబైలో ఉంటున్నానని సంజయ్ దత్ తెలిపారు. కుటుంబాన్ని మిస్ అవుతున్నానని, వాళ్లే నా సర్వస్వం అని, కటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడుతున్నానని సంజయ్ దత్ అన్నారు.