సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వం: మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇచ్చే పిలుపుకు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఆదివారం సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్ లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరై మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకు లలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయిన కారణంగా రక్తదానం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిని మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సుమారు 7.55 కోట్ల రూపాయల విరాళాలు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారులు, సంస్థలు అందజేసినట్లు చెప్పారు. ఇవే కాకుండా ప్రతిరోజు కార్పొరేటర్ లు, నాయకులు, పలు సంస్థల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు కరోనా పై సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. కరోనా నేపధ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. తలసేమియా, డయాలసిస్ రోగులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరం లో 250 మంది రక్తాన్ని ఇచ్చారు. ప్రధానంగా సంకేత్ సంస్థ ఆధ్వర్యంలో 70 మంది, trs సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో 30 మంది , trs నాయకులు తలసాని స్కై లాబ్ యాదవ్ ఆధ్వర్యంలో 25 మంది అమీర్ పేట కార్పొరేటర్ నామన శేషుకుమారి, trs నాయకులు సంతోష్, కరుణాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు. వీరే కాకుండా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరం లో సేకరించిన 250 యూనిట్ల రక్తాన్ని IPM, రెడ్ క్రాస్ సంస్థల నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, ఉప్పల తరుణి, సురేష్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, రాఘవయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.