ప్రభుత్వ సహాయాన్ని మరింత పెంచాలి – టీజేఎస్ నేత కోదండరామ్ డిమాండ్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదల అందరికీ ప్రభుత్వం అందిస్తున్న
సహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో తార్నాకలోని కోదండరామ్ నివాసంలో మున్సిపల్ సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ 12 కిలోల బియ్యాన్ని ,పప్పు ,పంచదార ,నూనె పాటు ఐదు వేల రూపాయల నగదును చెల్లించాలని డిమాండ్ చేశారు. దాతల సహాయం సరిపోవు నందున ప్రభుత్వాలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జన సమితి కార్యకర్తలు రాష్ట్రంలో ఎక్కడికక్కడ వీలైనంతవరకు పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య, నాయకులు జైపాల్ రెడ్డి, మద్దూరి సురేష్, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు