అక్కడ ఆరా తీయండి
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి టాబెట్లు కొనుగోలు చేసే వారి వివరాలను సేకరించాలని మెడికల్ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.