జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి
ప్రపంచం మొత్తం కరోనా మీద యుద్ధం చేస్తుంటే బుద్ధి మారని ఉగ్రవాదులు మాత్రం మన దేశం మీద దాడులకు దిగుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పోలీస్ క్యాంపులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోపోర్ టౌన్లో 179 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి ఉన్న చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు, పోలీసులు గాయపడ్డారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు భారత పారా మిలిటరీ బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడటం ఇది మూడోసారి. అయితే, భద్రతా బలగాలపై కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నది.