ఎవరూ ఆందోళన చెందొద్దు
గ్రీన్ జోన్‌లో చిలకలూరిపేట నియోజకవర్గం
పేటలో కరోనా నిర్ధారణ కాలేదు
కేవలం అనుమానిత కేసు అది కూడా ఒక్కటి మాత్రమే ఇప్పటివరకు మన దృష్టికి వచ్చింది
అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా
కరోనా కట్టడికి ఎలాంటి చర్యలైనా తీసుకోండి
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు
కరోనా అనుమానితుల ఇంటి పరిసరాలు పరిశీలన
నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులు అసలే నమ్మవద్దని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. నరసరావుపేటకు చెందిన ఒక హోంగార్డుకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. చిలకలూరిపేటకు చెందిన ఒక వైద్యురాలు ఆ హోంగార్డుకు నరసరావుపేటలోని ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. ఇప్పుడు ఆమె తల్లికి ప్రాథమిక పరీక్షలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సంకేతాలు రావడంతో పట్టణంలోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. స్థానిక కళామందిర్ సెంటర్‌లోని వైద్యురాలి ఇంటి పరిసరాలను ఎమ్మెల్యే విడదల రజిని గారు శనివారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. వైద్యురాలి తల్లికి కూడా ప్రాథమిక పరీక్షలో మాత్రమే కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానాలు మాత్రమే వెల్లడయ్యాయని, పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వైద్యురాలికి కూడా కరోనా పరీక్షలు చేశారని రెండు రోజుల్లో అందరి నివేదకలు వస్తాయని తెలిపారు. తుది నివేదకలు వచ్చే వరకు కరోనా ఊసే ఇక్కడ లేనట్లేనని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచించారు. ఎవరైనా వందతులు సృష్టించినా, అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కళామందిర్ సెంటర్లో ఆంక్షలు కఠినతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ కళామందిర్ సెంటర్‌తోపాటు బాధితురాలి ఇంటి వరకు ఆ పైన కూడా ఆంక్షలు కఠినతరం చెయాలని సూచించారు. ఏ ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చూడాలని చెప్పారు. ఉదయం తొమ్మది గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణదారులు కూడా తప్పనిసరగా సమయాన్ని పాటించాలన్నారు. కరోనా అనుమానితురాలి ఇంటికి సమీపంలో ఆంక్షలు కఠినం చేసిన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్ల వారికి ఏ సాయం కావాలన్నా తాను చేస్తానని తెలిపారు. వీఆర్ ఫౌండేషన్ ద్వారా తానే నిత్యావసరాలు పంపుతానని చెప్పారు. వైద్యురాలి కుటుంబసభ్యుల వైద్య నివేదకలు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. వాలంటీర్ల ద్వారా పంచేలా చూడాలని కమిషనర్‌కు సూచించారు. ఎమ్మెల్యే గారితోపాటు సీఐ సూర్యనారాయణ, కమిషనర్ శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తల్హాఖాన్, కొలిశెట్టి శ్రీనివాసరావు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.