వైద్యులపై దాడులా.. ఊరుకోం: ఈటల

నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంబించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాల్గొన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ,హైదరాబాద్ ప్రెసిడెంట్ ముజిబ్ ,ఇతర టీఎన్జీవో నాయకులు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

కోవిడ్ 19 వలన రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయి
దీనితో తలసేమియా,రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గమనించి యువకులు రక్తదానం చెయ్యాలని పిలునిచ్చాము.

యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ నారాయణ గుడా ఐపీఎఎంలో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వారికి అభినందనలు.

బ్లడ్ నిల్వవలు పెరుగుతున్నాయి ఇంకా ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు..

టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారు.

డాక్టర్ ల పై దాడులు హేమమైన చర్య,డాక్టర్ లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి.

బ్రిటిష్ ప్రధాని సైతం డాక్టర్ లను కొనియాడారు అది మర్చిపోతే ఎలా .క్యూబా లో చాలా మంది వైద్యులు ఇతర దేశాలకు వైద్య సేవలు చేయడానికి వెళ్తున్నారు

డాక్టర్లు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు, వారి పై పేషేంట్లు దాడి చేసిన పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్ పెట్టాం.వారికి కూడా శిక్ష వేస్తాం.

ఇలాంటి సందర్భంలో భర్తలను బయటకు పోనివ్వరు భార్యలు కానీ డాక్టర్ లను సేవ చేయుమని వారి భార్యలు పంపుతున్నారు వారి గొప్ప మనసుకు అభినందనలు.