జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు

జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు నిర్వహణ

  • కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లవద్దకే పండ్లు, కూరగాయలు
  • అవసరం ఉన్న ప్రాంతాలను తెలుసుకుని నాలుగు దినాలకు ఒకసారి వెళుతున్న వాహనాలు
  • మొబైల్ రైతుబజార్లతో అదుపులో కూరగాయలు, పండ్ల ధరలు
  • జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
  • తీసుకెళ్తున్న కూరగాయలు, ప్రజల నుండి లభిస్తున్న ఆదరణపై ఆరా
  • మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతుబజార్ ఎస్టేట్ల మేనేజర్లకు అభినందన
  • కీలక సమయంలో మొబైల్ రైతుబజార్లతో ప్రజలకు ఇబ్బందులు దూరం చేశారు
  • మొబైల్ రైతుబజార్ల వద్ద కరోనా ప్రబలకుండా సామాజిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు
  • కూరగాయల సేకరణతో పాటు పంపిణీ విధానం అద్భుతంగా చేస్తున్నారన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు