తెలంగాణలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 18 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 186మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వైరస్ తీవ్రత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, గద్వాల జిల్లాల్లో ఎక్కువగా ఉంది.
ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 427 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా కేసులు వెలుగుచేసిన ప్రాంతాల్లో అధికారులు పరిస్థితి సమీక్షించారు. వైరస్ ఇతరులకు సోకకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తగా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఇవాళ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా నిర్వహించారు.