ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

కరోనా వ్యాధి సృష్టించిన ఆర్థిక ఇబ్బందులను చుసిన పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు. ఈరోజు సుమారు 13 మంది ప్రగతిభవన్లో మంత్రి కే తారకరామారావుని కలిసి కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సహాయం కోసం విరాళాలు ఇచ్చి వాటికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈరోజు 4 కోట్ల 44 లక్షల రూపాయల విరాళాలు ముఖ్యమంత్రి సహాయనిధి అందాయి

విరాళాలు అందించిన వారి వివరాలు:

• యశోధా హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి యాబై లక్షలు
• ఏ యం అర్ ఇండియా లిమిటెడ్ యండి మహేశ్ రెడ్డి కోటి రూపాయాల చెక్కు అందించారు
• ఏలికో సంస్ధ 50 లక్షల విలువైన రెండు పూర్తిస్థాయి అటోమేటెడ్ వాటర్ క్వాలిటి అనలైజర్ మేషిన్లను అందించింది
• లోకేష్ మేషిన్స్, జియం పబ్లిక్ ఫండ్, అర్డినెన్సు ప్యాక్టరీ 25 లక్షల చోప్పున అందించారు.
• జెయస్సార్ గ్రూప్ సన్ సిటీ 20 లక్షలు
• నాగార్జున ప్రొభాయిల్డ్ మాడర్న్ రైస్ మిల్ సూమారు 20 లక్షల విలువైన చెక్కుని అందించింది
• జొగినపల్లి బి అర్ ఎడ్యూకేషనల్ సోసైటీ 17.5 లక్షలు, జెబి ఎడ్యూకేషనల్ సోసైటీ 12.5 లక్షలు
• పెడరేషన్ అప్ తెలంగాణ టింబర్ మర్చంచ్, శ్రీకర్ బయోటెక్ లు చెరో 10 లక్షలు
• విక్టర్ బయో జెనెటిక్స్ 5 లక్షలు అందించారు.