ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

నాదెండ్ల వీధుల్లో ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారీ చేసిన చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. వీధులు, ఇళ్ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని గారు తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని ట్రాక్ట‌ర్ ద్వారా పిచికారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ జీవిత కాలం ఎక్కువ‌ని, మిగిలిన వైర‌స్‌లన్నీ గంట స‌మ‌యంలో వ్య‌వ‌ధిలోపే మ‌ర‌ణిస్తాయ‌ని, క‌రోనా మాత్రం 24 గంట‌ల‌పాటు బ‌తికే ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌మాద‌క‌ర‌మైన ఇలాంటి వైర‌స్‌ను అరిక‌ట్టాలంటే ఇళ్లు, వీధుల‌ను శుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. క్రిమిసంహారిణిల‌ను పిచికారీ చేసుకోవాల‌ని చెప్పారు. ఇళ్ల ఫ్లోరింగ్‌ల‌ను కూడా రోజుకు మూడు సార్లు ర‌సాయ‌నాల‌తో శుభ్రం చేసుకోవాల‌ని చెప్పారు. ఎమ్మెల్యే గారి వెంట గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు, పార్టీ నాయ‌కులు ఉన్నారు.