కిమ్స్ హాస్పిటల్లో 100 మంది రక్త దానం
లాక్ డౌన్ నేపథ్యంలో యువత రక్త దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెరాస నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్స్ లో అయనతో పాటు మరో వంద మంది యువకులు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రక్తదానం చేయడం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గుతుంది అనేది పూర్తిగా అవాస్తవం చెప్పారు. రక్తదానం చేయడం వల్ల మరింత ఆరోగ్యాంగా ఉంటారన్నారు. లాక్ డౌన్ ఉన్న ఈ కఠిన పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అయితే భాదితుల అవసరాలు దృష్ఠ్టిలో ఉంచుకొని యువత మరియు తెరాస కార్యకర్తలు రక్తదానం చేయాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఆయన పిలుపు మేరకు 100 మందికి పైగా కిమ్స్ హాస్పిటల్ కి వచ్చారు. సామజిక దూరం పాటిస్తూ గంటకి పది మంది చొప్పున రక్తదానం చేశారు. ఈ రక్త నిల్వలను తలసేమియా, క్యాన్సర్, కరోనా భాదితుల కోసం వినియోగించాలని కోరారు. తెలంగాణనలో కరోనా భాదితులు వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు అని తెలిపారు. వారికీ అత్యవసర పరిస్థితుల్లో వారికీ అండగా ఉంటామని తెలిపారు. డాక్టర్ హితేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ రక్తదానం జరిగింది.











