అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు.

ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ కు వాళులు ఆరోపించిన వి.హనుమంతరావు.

ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నేను పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే కూల్చివేయడం ఖండిస్తున్నాను. ఇప్పుడు సమయం కాదు కాబట్టి ఊరుకుంటున్నాను.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అన్ని రాష్ట్రాల్లో తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ దారి చూపించిన దేవుడు అయన అని పేర్కొన్నారు. అంబేద్కర్ లేకుంటే బలహీనవర్గాలకు జీవితాలు లేవు.. బానిసత్వంలో మగ్గి పోయే వారు. అంబేద్కర్ కు మనం అందరం జీవితాంతం రుణపడి ఉండాలిని పిలుపునిచ్చారు.