మాస్క్ తో కెసిఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని తమని తాము కాపాడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులగా తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో కరోనా మీద తనదైన మాటలతో విరుచుకపడ్డారు. అయితే ఆయా సమేవేశాలలో మంత్రులు ఇతర అధికారులు కూడా మాస్కులు పెట్టుకున్నారు. కాగా ఏనాడూ కూడా కేసీఆర్ మాస్క్ పెట్టుకున్న దాఖలాలు లేవు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న తరుణంలోనే గత రెండు రోజులుగా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా పై సమీక్షా సమావేశానికి మాస్క్ తో కెసిఆర్ హాజరుకావడం ఇందుకు నిదర్శనం.