కుంభం అనిల్ కుమార్ రెడ్డి దాతృత్వం

పుట్టిన ఊరు వలిగొండ పై ప్రేమ తో 18 లక్షల విలువ జేసే 9 రకాల నిత్యావసర వస్తువుల ను మండల కేంద్రంలో ఉన్న 3 వేల కుటుంబాలకు పంపిణీ..
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ DEO కీర్తి .శే.. కుంభం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు తల్లిదండ్రులు పెరు పై కుంభం ప్రేమాలత శ్రీనివాస్ రెడ్డి సాంఘిక సేవ సమితి అధ్యర్యంలో పంపిణీ..
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి నియోజకవర్గం ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు గురికాకుండా ప్రేమలత శ్రీనివాస్ రెడ్డి సాంఘిక సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేశారు చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి అనే నినాదంతో ప్రజలందరికీ తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను నూనె,పసుపు, కారం, అల్లంవెల్లుల్లి, చింతపండు,ఉల్లిగడ్డ, కందిపప్పు, బియ్యం, ఉప్పు నేరుగా వారి ఇంటి గుమ్మం ముందే తెచ్చి ఇవ్వడం జరిగింది….

మొదటిసారిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పుట్టిన ఊరు గ్రామంలోని ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఇక్కడ నుండి ప్రారంభోత్సవం చేశారు…మిగితామండలాలకు కూడా తన వంతుగా సహాయం చేస్తామని అన్నారు…
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి త్వరలోనే పూర్తిగా అంతరించి పోవాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరారు సాంఘిక సంక్షేమ సేవా సమితి చైర్మన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు..