ఆలా అయితే గంటలోనే పనిచేస్తారు : జగదీష్‌రెడ్డి
విద్యుత్ కార్మికులు 24 గంటలు కష్టపడుతున్నారు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విద్యుత్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరెంటు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న పనులపై ఆయన ఇవాళ ఉన్నత అధికారుల్లాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి నెల బిల్లు మొత్తాన్ని చెల్లించాలన్నారు. లాక్‌డౌన్ ఎత్తేశాక 60రోజుల రీడింగ్ రికార్డ్ చేసి సరాసరి చెల్లించాలని కోరతాం, గత ఏడాది కంటే ఈ మార్చిలో 15శాతం విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందన్నారు. అయినా గడిచిన ఏడాది మార్చి బిల్లునే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. బ్రేక్‌డౌన్ అయితే గంట వ్యవధిలోనే పునరుద్ధరిస్తారు. వారికీ ప్రభుత్వం తరుపున అభినందనలు తెలిపారు.











