మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
రైతాంగానికి వరం-సిఎం కెసిఆర్ నిర్ణయమని, ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం, మక్కలకు బిల్లులను రైతుల ఖాతాల్లో కేవలం మూడు రోజుల్లోనే పడేలా సిఎం కెసిఆర్ ఆదేశించారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. రైతుల ధాన్యం కోసం 30వేల కోట్లను, మక్కల కోసం 3 వేల కోట్లను సిఎం కెసిఆర్ గారు ప్రత్యేకంగా సిద్ధం చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నట్లు అలాగే ప్రజలను కాపాడుకోవడానికి కెసిఆర్ అహర్నిషలు కష్టపడుతున్నారని మంత్రి చెప్పారు. ఇప్పటి దాకా రైతులకు వ్యాపారులు కూడా ఇలా ఇవ్వలేదని మంత్రి అన్నారు. ఈ దశలో ప్రజప్రతినిధులు రైతాంగానికి, ప్రజలకు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కెసిఆర్ గారి మాటను నిలబెట్టాలని, ప్రజలను, రైతులను ఆదుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి వెంట స్థానిక శాసన సభ్యులు అరూరి రమేశ్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.











