కరోనా వ్యాప్తి చెంద కుండా నివారించు మందులను స్ప్రే చేయించి బ్లీచింగ్ చల్లారు

నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి , TRS పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఈరోజు నల్లకుంట డివిజన్ లోని తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి ప్రక్క గల్లీలో, చైతన్య నగర్, అంజన్న గల్లీ, కోరుట్ల అపార్ట్మెంట్ లైన్, తిలక్ నగర్ మెయిన్ రోడ్డు మటన్ షాప్ గల్లీ, ఇందిరా నగర్, సంజీవయ్య నగర్, న్యూ సంజీవయ్య నగర్, భాగ్య నగర్, తదితర ప్రాంతాలలో సుమారుగా 800 ఇళ్ల దగ్గర కరోనా వ్యాప్తి చెంద కుండా నివారించు మందులను స్ప్రే చేయించి బ్లీచింగ్ చల్లించడం జరిగింది.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, లాక్ డౌన్ సందర్బంగా పేద ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని రెండు నెలలకు గాను అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యంను, నిత్యావసర సరుకుల కోసం 1500 రూ. లు అందించడం జరుగుతుందని మరియు ప్రజలు ఆకలితో బాధ పడవద్దని అన్నపూర్ణ క్యాంటీన్స్ ఏర్పాటు చేయించి రెండు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని కావున అవసరం వున్న వారు ఈ సదుపాయాలు ఉపయోగించూకోవాలని కార్పొరేటర్ తెలిపారు.