క్రీడాకారుడిగా లాక్డౌన్ కష్టంగా కనిపించినా..వ్యక్తిగతంగా, పౌరుడిగా నేను పూర్తి మద్దతునిస్తా. ఈ లాక్డౌన్ మన రక్షణ కోసమే”… పుజార

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 లాక్డౌన్ విధించే నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుందని టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సమయమంతా కుటుంబంతో గడుపుతున్నానని, దీంతో తన చిన్నారి కూతురు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. లాక్డౌన్ సమయంలో అందరూ ఏదో ఒక కొత్త పనిని నేర్చుకోవాలని, అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని ఓ ఇంటర్వ్యూ ద్వారా పుజార సూచించాడు.” ప్రభుత్వం సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అమెరికాతో పాటు చాలా దేశాల్లో వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్నది. ఆ తర్వాత వారు షట్డౌన్ చేశారు. ఇంత జనాభా ఉన్న మన దేశంలో వైరస్ను కట్టి చేడయం చాలా కష్టం. క్రీడాకారుడిగా లాక్డౌన్ కష్టంగా కనిపించినా..వ్యక్తిగతంగా, పౌరుడిగా నేను పూర్తి మద్దతునిస్తా. ఈ లాక్డౌన్ మన రక్షణ కోసమే” అని పుజార చెప్పాడు. భార్యకు సాయం చేస్తున్నాలాక్డౌన్ వల్ల సానుకూలత అంటే.. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని పుజార అన్నాడు.

అలాగే పనుల్లో కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నట్టు చెప్పాడు. “నేను వంట చేయలేను. ఎందుకంటే నాకు రాదు. అందుకే ఇండ్లు, పాత్రలు శుభ్రం చేయడం ద్వారా నా భార్యకు సాయం చేస్తున్నా.
ఇంతకు ముందు మనం చేయని పనులను ఇప్పుడు చేయడం కూడా ముఖ్యం” అని పుజార చెప్పాడుకూతురితో ఆడుకుంటున్నా ఇంట్లో ఎక్కువ సమయం తన కూతురు పూజతోనే ఆడుకుంటున్నానని పుజార చెప్పాడు. తల్లిదండ్రులం ఇద్దరం దగ్గరగా ఉండడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. “నా కూతురు ఆటలను, అల్లరిని కెమెరాలో ఎక్కువగా బంధిస్తున్నా. తల్లిదండ్రులు ఎక్కువ సమయం పక్కనే ఉంటుండడంతో పూజ చాలా సంతోషంగా ఉంది. నాతో ఆడుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నది. పూజ చాలా ఎనెర్జిటిక్”​ అని పుజార చెప్పాడు.