ఎండి ఖాజా మొహినొద్దీన్ పై కేసు

జనగామలో డిఆర్డిఎ అడ్మిన్ అసిస్టెంట్ పై కేసు నమోదు: సీఐ మల్లేష్
…………….
ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా విధులకు హాజరై కరోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో అడ్మిన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎండి ఖాజా మొహినొద్దీన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ డీఆర్డీవో రాంరెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 269, 270( ఇతరులకు ప్రాణ హాని తలపెట్టే విధంగా చేయడం, వైరస్ వ్యాప్తి చెందే విధంగా ప్రయత్నం చేయడం), సెక్షన్ 188( ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం) పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం గమనణించి కూడా యధావిధిగా విధులకు హాజరైనట్లు స్పష్టం చేశారు. ఈ నెల 21, 23, 27 తేదీల్లో విధుల కు హాజరై అధికారులు, సిబ్బందితో సన్నిహితంగా మెదిలి తన నిర్లక్ష్యాన్ని నిరూపించు కున్న ట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం తో పాటు సమాచారం లేకుండా ఢిల్లీకి వెళ్లి మత ప్రార్థనల్లో పాల్గొని వైరస్ ను ఇక్కడ వ్యాప్తి చెందేందుకు ప్రయత్నించిన ఖాజా మొహిదీన్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు.