లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో
కేరళ రాష్ట్రంలో 280 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా… లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే కేరళ రాష్ట్రం కరోనా కి హాట్ స్పాట్ కేంద్రంగా మారడం వలన… అక్కడ లాక్ డౌన్ చాలా కఠినంగా కొనసాగుతుంది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది కుటుంబాలు కేరళ రాష్ట్రంలోని ఓ ద్వీపం పై చిక్కుకుపోయారు. ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల రవాణా చేసే వాహనాలు కూడా తమ ప్రాంతానికి రాకపోవడంతో… అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ ఓ దేవుడిలా కనిపించాడు ఓ బోట్ మ్యాన్.
వివరాలు తెలుసుకుంటే… కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన ఓ యాభై ఏళ్ల వ్యక్తి తన బోటు(పడవ) నిండా కూరగాయలు, బియ్యం, పప్పు ఇంకా ఇతర నిత్యావసర సరుకులను నింపి దగ్గరలోని ద్వీపం పై చిక్కుకున్న వారికి తక్కువ ధరలకే విక్రయిస్తున్నాడు.దాంతో అక్కడి వారంతా ఈ బోట్ మ్యాన్ ని దేవుడి లాగా కొలుస్తున్నారు. ఆర్మీ జవాన్లు కూడా తమ వంతు సహాయం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ లో పేదవారికి నిత్యావసర సరుకులను అందజేశారు. దీనిపై అక్కడి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పీవీ సింధు, సచిన్ టెండూల్కర్, హిమ దాస్, ఇంకా 37 మంది తదితర క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈయన కరోనా వైరస్ ప్రభావం గురించి క్రీడాకారుల తో మాట్లాడారని తెలుస్తుంది. రాజస్థాన్ లోని బిల్వారా జిల్లాలో గత మూడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ తాజాగా వెల్లడించారు. నమోదైన 26 కేసులలో 13 మందికి నెగిటివ్ అని నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని… వీరిలో 140 మంది ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు హాజరైన వారిని ఆంధ్రప్రదేశ్ సీఎం (జగన్మోహన్ రెడ్డి) కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని నిందిస్తే ఇండియన్ పీనల్ కోర్టు కింద అరెస్టు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈరోజు ముగ్గురిని అరెస్టు చేశామని ప్రకటించింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.