లిజెల్లీ వివాహం క్రోనేతో వాయిదా
కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది . దేశాలు గడగడలాడిపోతున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పటికే ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. 50వేలకు మరణాల సంఖ్య చేరుకుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఎఫెక్ట్ సౌతాఫ్రికా మహిళ క్రికెటర్ లిజెల్లీ మ్యారేజ్‌పై పడింది. లిజెల్లీ వివాహం తన ప్రియుడు క్రోనేతో ఏప్రిల్ 10న వివాహం జరగాల్సి ఉంది. కాని అక్కడ లౌక్‌డౌన్ ఏప్రిల్ 10నే 15వ రోజుకు చేరుకుంటుంది. దీంతో లిజెల్లీ పెళ్లీ నిలిచిపోనుంది.