గీత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండి


రాష్ట్రంలో లక్షలాది మంది
గీత కార్మికులు వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నిబంధనలతో కల్లు గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క రోజు తాటి, ఈత గెలలను మెర పెట్టకుంటే 6 నెలల వరకు కల్లు రాదు. అందుకని చెట్లు ఎక్కడానికి గీత కార్మికులు వెళుతున్నారు. ఇది అర్దం చేసుకోకుండా పోలీసులు వారిపై లాఠీ చార్జి చేస్తున్నారు. వృత్తి గురించి ఎక్సయిజ్ అధికారులకు తెలిసి కూడా వారు అలాగే వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వెంటనే స్పందించి చెట్లు ఎక్కడానికి షరతులతో కూడిన అనుమతి కల్పించాలి.
వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్న గీత కార్మిక కుటుంబాలకు నెలకు 5 వేలు రూపాయిలు చొప్పున సహాయం చేయాలి.
యం. వి. రమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
కల్లుగీత కార్మిక సంఘం.