సీసీఎంబీలో ఒకరోజు వందలాది టెస్టులు చెయ్యొచ్చు.
కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నుంచి మాకు ఓఎం (ఆర్డర్ మెమో) ఉంది.
కొన్ని ప్రాథమిక టెస్టులు విజయవంతంగా చేసాం.
ఐసీఎంఆర్ అప్రూవ్డ్ కిట్స్ ఇంకా రావలసి ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ కిట్స్ అందుబాటులో ఉన్నా వాటిని మేం టెస్టుల కోసం వాడలేం.
మరోవైపు గాంధీ హాస్పిటల్ నుంచి కూడా మాకు బ్లడ్ శాంపిల్స్ రావలసి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు. వాళ్ళు కూడా కిట్స్ కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు.
మేం సంసిద్దంగా ఉన్నాం.
సాంకేతికంగా ఇతరత్రా మేం పర్ఫెక్ట్ గా ఉన్నాం.
సీసీఎంబీలో ఒకరోజు వందలాది టెస్టులు చెయ్యొచ్చు. అందుకు తగ్గ సామర్థ్యం మా సంస్థకు ఉన్నది.
ఒక్కరోజులో వెయ్యికి పైగా టెస్టులు చేయగలుగుతాం. ఇంకా అవసరం ఐతే సీడీఎఫ్డీ లాంటి సంస్థల సాయం కూడా తీసుకుంటాం.
మా ప్రయోగశాలలో శాంపిల్ నుంచి మేం వైరస్ ను వేరు చేయగలుగుతాం. వైరస్ ను నైపుణ్యంతో హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది.
మాకు ఉస్మానియా లాంటి లోకల్ ఆసుపత్రులలో ఇప్పటికే టై అప్ ఉంది.