హలో జర్నలిస్ట్…
జర్నలిస్టులు ఆలోచించండి….ఇప్పుడే ఒక చిన్న లీడర్ ఫోన్ చేశారు పాపం ఆయన వార్తలు సంవత్సరం లో ఒకటి రెండుసార్లు కూడా ఎవరు రాయరు…కానీ ఆయనకు తెలుసు రిపోర్టర్లు ఏమి చేస్తారు..ఎలా జీవిస్తారు …ఏమి సంపాదిస్తారు అని..అన్నా మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి..
రిపోర్ట్ కు ఉండే సమస్యల గురించి తెలిసీ ఏమి అనుకోవద్దు నీకు ఏమైనా అవసరమా అన్న అని అన్నారు..ఏమి లేదన్నా అని మొహమాటం కోసం అన్నాడు రిపోర్టర్. కానీ ఏ రిపోర్టర్ ఇంటి సమస్యల గురించి చెప్పుకోరు ఎందుకంటే ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ కదా . అయినా మీరు రోజు మీ జోన్ నిండా ఆ పార్టీ, ప్రజా ప్రతినిధి వార్తలు రాస్తుంటారు కదా ఆయన ఉండగా మేము ఎంత అన్నారు…అవును మాకు ఏ సమస్య ఉండకుండా ఆయన చూస్తారు ప్రతి దీపావళికి పిలుస్తారు మాకు సంవత్సరం లో ఎంత అవసరమో అంత ఇస్తారు మాకెమి ఇబ్బంది లేదన్నా అన్నారు రిపోర్టర్లు…అవును అప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులకు వచ్చిన వడ్డీతో మా కుటుంబం మొత్తం హాయిగా నడుస్తుంది అందుకే ప్రతిరోజు ఆయన వార్తలకు ముఖ్య ప్రధాన్యతనిస్తాం అన్నారు…అయినా మా నుంచి ఈ సమయం లో చిన్న సహాయం చేద్దామని అనుకుంటున్నాము అన్న అన్నారు ఆ చిన్న లీడర్…మీరు ఏమి అనుకొము అంటే మేము కొంత మందికి బియ్యం పంపిణీ చేస్తున్నాము వాళ్ళకి ఇచ్చిన బియ్యం బస్తా మీకు ఇద్దామని అనుకుంటున్నా ఏమి అనుకోరూ కదా అన్నారు…అప్పటికే రిపోర్టర్ ఇంట్లో బియ్యం మొత్తం అయిపోయాయి కానీ వద్దంటే ఇబ్బంది తీసుకోవాలంటే ఆత్మాభిమానం కానీ మిగతా రిపోర్టర్ల పరిస్థితి ఇంకా దారుణం. అందుకే ఏమి అనలేక మిగతా రిపోరటర్ల పరిస్థితి చూడలేక ఒకే అన్నా మీ అభిమానం అన్నారు..వెళ్లి 25 కిలోల బియ్యం తెచ్చుకున్నారు…
నగరంలో ఉండే ఒక రిపోర్టర్ లాక్ డౌన్ సుమయం లో తాను అనుభవించిన శ్వీయ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు…ఎంత ఐశ్వర్యం ఉన్నా అదెక్కడినుంచి ఒచ్చిందో గుర్తుంచుకునే వాడే నిజమైన నాయకుడు…