ఇంకా మారని చైనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 6,00,000 దాటింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 18 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నప్పటికీ చైనా మాత్రం ఏం మారలేదు. 

ఇప్పటికీ చైనా ప్రజలు చీమలు, పాములు, కప్పలు… ఇలా వేటినీ వదలకుండా తింటున్నారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ వల్ల వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. చైనా వల్ల పరోక్షంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ పతనమవుతున్నా చైనీయులు మళ్లీ అవే జంతువులను ఆహారంగా తీసుకుంటున్నారు.జింకలు, నెమళ్లు, ఉడుములు, కుక్కలు నేటికీ చైనా మార్కెట్లో విక్రయిస్తున్నారు. 

చైనాలో సజీవ జంతువులను కస్టమర్లకు విక్రయించే వేలాది మార్కెట్లు ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా వల్ల అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నా చైనా ఏ మాత్రం మారలేదు. గతంలో చైనాలో సివిట్ అనే పిల్లి నుంచి సార్స్ వైరస్ సోకింది. శాస్త్రవేత్తలు ఆలుగు అనే వన్య ప్రాణి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. ఆలుగు నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందని ఆరోపణలు ఉన్నా చైనా వాటిపై నిషేధం విధించటం లేదు. 
చైనీయులు సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా జంతువుల, పక్షుల అవయవాలను ఉపయోగిస్తారు. అందువల్లే వారు జంతువులపై నిషేధం విధించరు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైతం చైనాకు సాంప్రదాయ వైద్యం ఖజానాలాంటిదని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తాయి. కొందరు రోగులు వైద్యంలో భాగంగా జంతువుల పచ్చిమాంసం తినడం, స్రావాలను తాగడం వంటివి చేస్తూ ఉంటారు.