ప్రపంచరంగస్థల దినోత్సవంలో… కరోనగర్వభంగంగర్వభంగం
ప్రపంచమే ఒక రంగస్థలం, అందులో ఈ మానవమనుగడే ఒక “నాటకం” ఈ నాటకంలో నటించే పాత్రధారులం మాత్రమే మనం.
ఈ నాటకంలో ఆయా పాత్రల నిడివి ఏమేరకు ఉంటే అంతవరకు మేటిగా నటిస్తూ , ఆ పాత్రలకు న్యాయంచేస్తూ నాటకవిజయానికి నాంధిగా నిలవడమే మన ముందున్న కర్తవ్యం.
ఇంతవరకు మనం ఆడిన నాటకం ఒకఎత్తు ఇప్పుడు ఆడుతున్న ఈ రెండవ రంగం ఒక ఎత్తు. ఎవ్వరి పాత్రలకు వారు న్యాయంచేస్తూ ముందుకు సాగాలి.ఈ రంగంలో ప్రతినాయకపాత్రలో “కరోన్న” మహమ్మారి రంగప్రవేశంచేస్తూ ప్రపంచనలుమూలల తనకెదురులేదనే గర్వంతో విలయతాండవం చేస్తుంది.ఎన్నో కుటుంబాలు తన బారినపడి దేశదేశాలు భయబ్రాంతులకు గురవుతున్నాయి. ఇలాంటి భయానక పరిస్తితులో “కథానాయిక” పాత్రలు పోషిస్తున్న “పారిశుధ్యకార్మికులు” “డాక్టర్లు” “నర్సులు” “వార్డ్ బాయ్”లు “పోలీసులు”ఇలా అందరూ మన ప్రాణాలకు వారి ప్రాణాలను అడ్డుపెడుతూ తమ పెళ్లాంపిల్లలను వదిలి మనగురించి వారు రోడ్లపైకి వచ్చి తమ విధులను నిర్వర్తిస్తూ, ఆ మహమ్మారి కోరలు పీకి పాతాళంలో పాతిపెట్టి “కరోన గర్వభంగం” పరిసమాప్తం గావించడానికి నడుంకట్టి మనకు బాసటగా నిలుస్తూ వారి వారి పాత్రలకు న్యాయం చేస్తున్నారు. మరి మనం కూడా మన పాత్రలకు న్యాయం చేయాలిగా మనవి సహాయకపాత్రలు కాబట్టి వారికి సహాయంగా ఉంటే చాలు అదే పదివేలు. మనం చేయాల్సింది ఒక్కటే మన ఇళ్లనుంచి బయటికి రాకుండా ఉంటే చాలు.
మన గురించి పాటుపడుతున్నవారికి మనం బాసటగా నిలిస్తే మన ఈ నాటకం “బంగారు నంది” సాధించినట్లే.
మానవరూపంలో సేవలందిస్తున్న దేవతామూర్తులందరికి షాష్టాంగనమస్కారాలు???
ఇందుకు సహాయసహకారాలు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా,సినీ ప్రముఖులు,మానవత్వం చాటుకుంటున్న ప్రతివ్యక్తికి పాదాభివందనాలు???
అయ్యో….మర్చిపోయాను
ఈ నాటకానికి మూలకారకులైన దర్శకనిర్మాతలకు, నటీనటులకు, సంకేతికనిపుణులకు, కళాపోషకులకు, కళాభిమానులకు ముఖ్యంగా ప్రేక్షకదేవులకు అందరికి “ప్రపంచరంగస్థల దినోత్సవ” శుభాకాంక్షలు?????
……బాపన్ పల్లి వెంకటస్వామి
మేకప్ ఆర్టిస్ట్.