సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు
కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు అంతా తమ ఇళ్లు వదలి బయటకు రావద్దని ఆయన అందరిని కోరారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సమాజంలోని కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వారిలో ఎక్కవశాతం పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకొనేందుకు, కరోనా వ్యాధికి చికిత్స అందించేందుకు గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు