బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు.

“ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించాం” అని అధికారిక ప్రతినిధి ప్రకటించారు.

కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తరువాత బోరిస్ జాన్సన్ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. “నాలో కరోనావైరస్ లక్షణాలను స్వల్పంగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఆగకుండా దగ్గు వస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు నేను పరీక్ష చేయించుకున్నాను.
పాజిటివ్ అని తేలింది. నేను స్వీయ నిర్బంధం విధించుకుని ఇంటి నుంచే పని చేస్తాను” అని ఆ వీడియోలో బోరిస్ తెలిపారు.