ఆర్ …ఆర్…ఆర్…

దర్శక ధీరుడు రాజమౌళి నిన్న ఉగాది సందర్బంగా ఆర్ఆర్ఆర్ తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఆనందం నింపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రౌద్రం-రణం-రుధిరం అనే టైటిల్‌ను చేస్తూ మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో ఎన్టీఆర్ ను జలానికి, రామ్‌చరణ్ ను అగ్నికి ప్రతీకలా చూపించారు. ఇక ఈ లుక్ ఫై మెగాస్టార్ స్పందించారు.ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడే ఆర్ఆర్ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ చూశాను. కనుల విందుగాను, రోమాలు నిక్కపొడుచుకునేలా టీజర్ ఉంది. రాజమౌళి, ఎన్టీఆర్, రాజమౌళి వర్క్ చాలా బాగుంది. కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మీకు మరింత వినోదాన్ని ఆర్ఆర్ఆర్ టీజర్ అందిస్తుందని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ రిప్లయ్ ఇచ్చారు. చిరంజీవి కి థాంక్స్ చెపుతూ ట్వీట్ చేసాడు