తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని ఛైర్మన్, మీడియా & కమ్యూనికేషన్స్, టీపీసీసీ సామ. రామ్మోహన్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ తో సహా పలు నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయించిందని, పార్టీ పరిస్థితి బాగా లేదని సర్వేలో తేలిందని సెఫలజిస్టులుగా చెప్పుకునే కొంత మంది కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు.
తనతో కాంగ్రెస్ పార్టీ నిత్యం సర్వేలు చేపిస్తోందని సైదులు అనే ఒక వ్యక్తి మీడియాలో చెప్పుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సెఫాలజిస్ట్‌లుగా ఎవరినీ నియమించలేదు. సర్వేలు చేయడం కోసం AICCలో గానీ TPCCలో గానీ ఎలాంటి వ్యవస్థ ఉండదు. మా కార్యకర్తలే మా స్ట్రాటజిస్ట్‌లు.
సైదులు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతనికి పార్టీలో ఎలాంటి పదవి లేదు. కనీసం ఆయనకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు.
ఆయన సొంతగా సర్వేలు చేస్తున్నానని కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యే ప్రయత్నం గతంలో చేశాడు. ఆయా సందర్భాల్లో దిగిన ఫోటోలను ఇప్పుడు అసందర్భంగా వాడుతూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు.
బీఆర్ఎస్ నేతల నుండి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కు వ్యతిరేక ప్రచారం చేస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు , మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.











