గాజుల రామారంలో హైడ్రా ఉక్కపాదం

హైదరాబాద్లోని గాజుల రామారంలో ‘హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది. ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది.