అబ్బాయిల మనసులు దోచుకుంటున్న మధుమిత

తన అందచందాలతో అబ్బాయిల మనసులు దోచుకుంటూ, తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న వర్ధమాన నటి మధుమిత. స్టైలిష్ లుక్స్, మాయ చేసే చిరునవ్వుతో యూత్ ఆడియన్స్‌ని మంత్రముగ్ధులను చేస్తోంది.

ఇటీవల రక్త గులాబీలు, నేను రెడీ, అఖండ 2, చీర కొత్తగ వంటి సినిమాల్లో నటించి తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. చిన్న తెరపైన కూడా మధుమిత తన ప్రత్యేకమైన స్టైల్‌ని కొనసాగిస్తోంది. జీ తెలుగు సీరియల్స్ మా అన్నయ్య, జగద్ధాత్రి, ముక్కుపుడకతో పాటు, ఈటీవీ అమ్మాయిగారు సీరియల్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.

పలు లఘు చిత్రాల్లో కూడా తన నటనతో మెప్పించిన మధుమిత, యూత్ హృదయాల్లో పదిల స్థానం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలు, ట్రెండీ వీడియోలతో అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తోంది.

ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ, త్వరలోనే మరిన్ని క్రేజీ ఆఫర్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, సినిమాలు – సీరియల్స్ – సోషల్ మీడియా అన్నీ కలిపి, మధుమిత టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుందని చెప్పొచ్చు.