అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ అమ్మాయి
సినిమా ఓ రంగుల ప్రపంచం. ఇందులో అడుగు పెట్టాలని ప్రతీ ఒక్కరి కోరిక. అయితే ఈ పరిశ్రమలో నెట్టుకురావాలంటే కాస్త కష్టమైన పనే. అయినా ఎక్కడా వెనక్కి తగ్గేది లేదంటూ ముందుకు దూసుకపోతుంది మన హైదరాబాదీ అమ్మాయి మోహన సిద్ది. తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. చిన్న సినిమాలో అయినా తన సత్త చాటుతోంది. ఆమె గురించి తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందేే

1999 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జన్మించిన మోహనా సిద్ధి, బి.కాం (కంప్యూటర్స్) పూర్తి చేసిన తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. 2021లో సినీ ప్రవేశం చేసిన ఆమె, తెలుగుతో పాటు తమిళ చిత్రసీమల్లోనూ తన ప్రతిభను చూపిస్తోంది.

తెలుగులో రౌద్రరూపాయ నమః (2024), గది (2025) చిత్రాలలో ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభుత్వ సారాయి దుకాణం, ఎస్.డి సి/ఓ వెంచపల్లి వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. తమిళంలో తరైపడై సినిమాతో అడుగుపెట్టి, మరిన్ని ప్రాజెక్టులలో నటిస్తోంది. త్వరలో కన్నడ సినిమాల్లోనూ కనిపించబోతోంది. తన కృషి, పట్టుదలతో దక్షిణ భారత చిత్రసీమలో ఒక వెలుగొందే యువ నటిగా ఎదుగుతోంది.











