భారతదేశపు అతిపెద్ద వర్చువల్ హెచ్ఆర్ సమావేశాన్ని నిర్వహించిన కేక
కేక ఇటీవల భారతదేశ అతిపెద్ద వర్చువల్ హెచ్ఆర్ సదస్సు అయిన తన రెండు-రోజుల HR Katalyst 2.0 ఈవెంట్‌ను నిర్వహించింది. అత్యంత ముఖ్యమైన హెచ్ఆర్ అంశాలపై అంతర్దృష్టితో కూడిన చర్చ లను పరిశ్రమ నాయకులతో లోతైన మేధో అనుభవాన్ని అందించింది. భాగస్వాములైన క్లియర్‌సైట్, నోవా బెని ఫిట్స్, స్ప్రింగ్‌వర్క్స్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో 17 విభిన్న అంశాలపై తమ నైపుణ్యాన్ని పంచుకోవ డానికి 50 మందికి పైగా వక్తలు వచ్చారు.
23,000 రిజిస్ట్రేషన్‌లతో, 10 దేశాల విభిన్న శ్రేణి నుండి 8000+ నిపుణులు వెబ్‌నార్‌లలో చేరారు. ఇలా హాజరైన వారు ఒక్కొక్కరు సగటున 3.5 గంటలుగా 20+ సెషన్‌ల వీడియో కంటెంట్‌ని వినియోగించారు.
రిలయన్స్ హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్జీత్ ఖండూజా “బిహిండ్ ది స్మైల్: ది సైలెంట్ కాస్ట్ ఆఫ్ ఫేకింగ్ ఎమోషన్స్ ఎట్ వర్క్” అనే శీర్షికతో కీలక ప్రసంగం చేయడంతో సదస్సు ప్రారంభమైంది. తరచుగా పట్టించుకోని వర్క్ ప్లేస్ భావోద్వేగాలను ఇందులో ప్రస్తావించారు. ఈవెంట్ రెండో భాగంలో క్లియర్‌సైట్ చీఫ్ ఆప రేటింగ్ ఆఫీసర్ జోసెఫిన్ గ్రూమ్ “హెచ్ఆర్ టీమ్‌ను నిర్మించడంలో ముఖ్యమైన అంశాలు” అనే అంశంపై ఆలోచ నాత్మకమైన ప్యానెల్ చర్చకు నాయకత్వం వహించారు. కేక హెచ్‌ఆర్ ప్రాసెస్ కోచ్ క్షితిజ్ సచన్– పర్‌ఫార్మెన్స్ మేనేజ్ మెంట్, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో సమర్థవంతమైన లక్ష్య-నిర్ధారణ వ్యూహాల కోసం ఆచరణాత్మక చి ట్కాలను అందిస్తూ “గోల్ సెట్టింగ్ హక్స్” ఇంటరాక్టివ్ వర్క్ షాప్‌ను నిర్వహించడంతో ఆ రోజు ముగిసింది.
రెండో రోజు సదస్సు “హెచ్ఆర్ హెడ్‌లు సీఈఓలుగా మారడం ఎలా?” అనే అంశంపై ఒక కీలక చర్చా కార్య క్రమంతో ప్రారంభమైంది. ఇందులో నోవా బెనిఫిట్స్ సీఈఓ & వ్యవస్థాపకులు సారాంశ్ గార్గ్, SIXT రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (‘ఇండియా) కో-సీఈఓ సుమంత్ బిఎస్, కేక హెచ్ఆర్ కమ్యూని కేషన్స్ మేనేజర్ డాక్టర్ నిషాత్ అఫ్జల్ దీనిలో పాల్గొన్నారు. ఈ చర్చ హెచ్ఆర్ నాయకత్వం నుండి సీఈఓ అయ్యే వరకు ప్రయాణాన్ని అన్వేషించింది, ఎగ్జిక్యూటివ్ పాత్రలను చేపట్టాలని కోరుకునే హెచ్ఆర్ నిపుణుల కోసం విలువైన ఆలోచనలను అందించింది.
టాప్‌లైన్ పీపుల్ సక్సెస్ అండ్ కమ్యూనిటీ డైరెక్టర్ మొహమ్మద్ సుఫియాన్ సైత్‌తో “ఎంప్లాయీ అటానమీ వ ర్సెస్ మైక్రోమేనేజ్‌మెంట్” అనే అంశంపై చర్చ జరిగింది. కార్యాలయంలో స్వయంప్రతిపత్తి, మైక్రో మేనేజ్‌మెంట్ మధ్య సరైన సమతుల్యతను సాధించడానికి సంబంధించి ఈ చర్చలో పాల్గొన్నవారు విలువైన అంతర్దృష్టుల ను పొందారు. స్ప్రింగ్‌వర్క్స్ సీఈఓ కార్తిక్ మాండవిల్లే హోస్ట్ చేసిన ఫైర్‌సైడ్ చాట్, “ఎగ్జిట్ ఇంటర్వ్యూస్, ఆఫ్ బోర్డింగ్ అండ్ రిటెన్షన్ స్ట్రాటజీస్”ను అన్వేషించింది, ఇది సంస్థను విడిచిపెట్టాలనుకున్న వారి నుండి నేర్చుకోవడం అనే ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తుంది.
పీపుల్ మ్యాటర్స్ సీఈఓ ఈస్టర్ మార్టినెజ్ ముగింపు ఉపన్యాసంతో ఈ మాగ్నమ్ ఓపస్ ఈవెంట్ ముగిసింది. HR Katalyst 2.0 తన ప్రముఖ వక్తలు, విభిన్న అంశాలు, ఇంటరాక్టివ్ సెషన్‌లతో అంచనాలను అధిగమించిం ది. హాజరైన వారికి విజ్ఞాన సంపదను అందించింది. ఈ సదస్సుకు హాజరైన వారు పరిశ్రమ ప్రముఖులు పంచు కున్న వినూత్న పరిష్కారాలు, వ్యూహాల ద్వారా ప్రేరణ పొందారు.
“HR Katalyst 2.0కి వచ్చిన అద్భుతమైన స్పందనతో మేం ఆనందిస్తున్నాం” అని కేక హెచ్ఆర్ సేల్స్ వీపీ ధీరజ్ పాండే అన్నారు. ‘‘ఈ సమావేశం హెచ్‌ఆర్‌లో అత్యుత్తమ వ్యక్తులను ఒకచోట చేర్చింది, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించింది, నేర్చుకోవడం, నెట్‌వర్కింగ్ కోసం ఒక వేదికను అందించింది. ఈ ఈవెంట్ ను అద్భు తంగా విజయవంతం చేసినందుకు మా భాగస్వాములు, వక్తలు, హాజరైన వారికి మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని అన్నారు.
HR Katalyst గురించి, భవిష్యత్ ఈవెంట్ల గురించి మరింత సమాచారం కోసం దయచేసి keka.com ను సందర్శించగలరు.